![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -706 లో.... ఈ రోజు కొత్త సీఈఓని ప్రకటిస్తారని బోర్డు మెంబర్స్ అందరు మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తారు. మరొకవైపు తాత మీటింగ్ కంటే ముందు మీకు ఒకరిని పరిచయం చేస్తానని కార్తీక్ చెప్తాడు. బాలరాజు దగ్గరికి కార్తీక్ వెళ్లి తన కళ్ళకి గంతలు కడుతాడు. మీ చుట్టూ కెమెరా ఉంటుంది. నేను చెప్పిన కంటెంట్ చెప్పండి అని కార్తీక్ అతనికి చెప్పి చెక్ జేబులో పెడతాడు. అతన్ని శివన్నారాయణ ముందుకి తీసుకొని వెళ్తాడు. బాలరాజుని చూసి పారిజాతం, జ్యోత్స్న భయపడుతారు.
ఆ తర్వాత బాలరాజు క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అవుతాడు. వెయ్యి మందికి ఫుడ్ ఆర్డర్ కావాలి.. ప్లేట్ రెండు వేలు అని అంటాడు. శివన్నారాయణకి కార్తీక్ సైగ చేస్తాడు. ఆ రోజు ఆఫీస్ కీ వచ్చి ఆర్డర్ ఇచ్చింది ఇతనే అని కార్తీక్ సైగ చేస్తాడు. దాంతో అతని చెంప చెల్లుమనిపిస్తాడు శివన్నారాయణ. బాలరాజు కళ్ళకి గంతలు తీసి సీన్ లో కొట్టే సీన్ ఉందని చెప్పలేదని అతను అంటాడు. పారిజాతాన్ని బాలరాజు చూసి.. మేడమ్ మీరు ఇక్కడే ఉన్నారా అని అనగానే అందరు షాక్ అవుతారు. అసలు నీతో ఆ రోజు ఆర్డర్ ఇవ్వమని ఎవరు చెప్పారని శివన్నారాయణ బెదిరించిగా అతను పారిజాతం పేరు చెప్తాడు. తన పేరు ఎక్కడ బయటపడుతుందోనని జ్యోత్స్న రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. గ్రానీ దీప అంటే ఇష్టం లేకుంటే ఇలా చేస్తావా అని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది. పారుతో బాలరాజుని పురామయించింది జ్యోత్స్న అని అందుకు సంబంధించిన ఆడియోని కార్తీక్ వినిపిస్తాడు. అది జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకున్న ఆడియో క్లిప్.. అది విని శివన్నారాయణ షాక్ అవుతాడు.
జ్యోత్స్న, పారిజాతం వంక శివన్నారాయణ కోపంగా చూస్తాడు. తర్వాత ఇలాంటి మోసాలు చేసే వారితో పని చెయ్యలేను.. పోటీ పడలేనని సూరజ్ అంటాడు. మీరు కూడా వెళ్ళండి దీప గారు అని సూరజ్ అంటాడు. ఎవరు ఎక్కడికి వెళ్లొద్దు మీటింగ్ అయ్యాక వీళ్ళ సంగతి చెప్తానని శివన్నారాయణ అంటడు. ఆ తర్వాత జ్యోత్స్న భయంతో దీపనే సీఈఓ ఆ అర్హత తనకే ఉందని అంటుంది. కంపెనీ గ్రోత్ పరంగా చూస్తే దీపకి ఇచ్చిన రెస్టారెంట్ ఎక్కువ శాతం ముందు ఉంది అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |